Free YouTube views likes and subscribers? Easily!
Get Free YouTube Subscribers, Views and Likes

వనామి రొయ్యల సాగులో యువరైతు విజయభేరి || Better farming methods in vannamei shrimp || Karshaka Mitra

Follow
Karshaka Mitra

The success story of Ideal Young farmer about Vannamei Shrimp/Prawn farming.
Aquaculture production has grown enormously in recent years and Penaeid shrimps are one of the most important cultured species worldwide, especially in Asia, due to their high economic value and export.
Litopenaeus vannamei (white leg shrimp) species, which have been introduced to many coastal states of India, now account for 90 percent of the country's total shrimp culture. The species exhibits a fast growth rate and its culture period is significantly shorter than that of Penaeus monodon (tiger prawn), making it an attractive alternative to tiger prawn production in several countries.
In India, Andhra Pradesh is the No.1 position in the Vannamei Shrimp culture area and Production. Due to the many difficulties currently facing Vannamei prawn farming, some farmers are on the path to success in cultivation with nanotechnology. One of them is Kondapalli Ramakrishna from Chanamilli village in West Godavari district. This farmer harvests 3 crops a year and is successful in each crop. Let us know the success story of this farmer in this story.

వనామి సాగులో విజయభేరి మోగిస్తున్న పశ్చిమ గోదావరి జిల్లా రైతు
నానో టెక్నాలజీతో ప్రతి పంటలోను మంచి ఫలితాలు

ప్రపంచ వాణిజ్య విఫణిలో భారత దేశానికి డాలర్ల పంట పండిస్తున్న పరిశ్రమగా నేడు వనామి రొయ్యలసాగు ఖ్యాతినార్జిస్తోంది. టైగర్, స్కాంపీ రొయ్యలసాగులో వరుస ఉత్పాతాలతో సంక్షోభంలో చిక్కుకుపోయిన ఆక్వా రంగానికి వనామి రొయ్యలసాగు నూతన జవసత్వాలు కల్పించింది. 2009వ సంవత్సరం నుండి ఈ కల్చర్ విస్తరణతో దేశంలో రొయ్య కల్చర్ కు పేరెన్నికగన్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తన ప్రత్యేకతను చాటుతోంది. మంచినీటి చెరువుల్లో కేవలం 5 శాతం ఉప్పదనం వున్న నీటిలో సైతం ఈ రొయ్య పెరుగుదల ఆశాజనకంగా వుండటంతో కోస్తా జిల్లాల్లో ఈ పంటసాగు శరవేగంగా విస్తరించింది. ఈ కల్చర్ ప్రారంభమైన కొత్తలో రైతులు ఎకరాకు రెండున్నర లక్షల పిల్ల వరకు వదిలేవారు. కానీ రానురాను తెల్లమచ్చ వైరస్, విబ్రియో, వైట్ గట్ వంటి వ్యాధులు ఈ కల్చర్ కు పెనుముప్పుగా మారటంతో, ప్రస్థుతం హైడెన్సిటీ విధానంలో ఈ రొయ్య సాగును తగ్గించి, ఎకరాకు లక్ష నుండి లక్షన్నర పిల్లను మాత్రమే వదులుతున్నారు. దీనివల్ల సమస్యలు కొంత తగ్గుముఖం పట్టాయి. సాధారణంగా వనామి రొయ్య పంటకాలం 120 రోజులు. 30 కౌంటు, అంటే కిలోకు 30 రొయ్యలు తూగెేవరకు పంటను పెంచితే రైతులకు మంచి మార్కెట్ ధర లభించే అవకాశం వుంది. కొంతమంది రైతులు 40 నుండి 50 కౌంటు దశలో కూడా ఈ పంటను మార్కెట్ చేసి రిస్కును తగ్గించుకునే దిశగా ముందడుగు వేస్తున్నారు. ఎకరాకు 4 నుండి 5 లక్షల పెట్టుబడి ఖర్చు అయినప్పటికీ, మార్కెట్ ధర అనుకూలిస్తే పెట్టుబడికి రెట్టింపు లాభం వచ్చే అవకాశం వుండటంతో చాలామంది ఈ పరిశ్రమపట్ల ఆసక్తి చూపిస్తున్నారు. అయితే గత రెండుమూడు సంవత్సరాలుగా ఈ పరిశ్రమలో తరచూ వ్యాధుల విజృంభిస్తుండటం, ధరల్లో తీవ్రమైన హెచ్చుతగ్గుల వల్ల రైతులు తరచూ నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ నేపధ్యంలో వనామి రొయ్య సాగు తీరుతెన్నులను తెలుసుకునేందుకు కర్షకమిత్ర బృంధం పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించింది. ఈ సందర్భంగా తారసపడిన మట్టిలో మాణిక్యం కొత్తపల్లి రామకృష్ణ.

పశ్చిమ గోదావరి జిల్లా, నిడమర్రు మండలం, ఛానమిల్లి గ్రామానికి చెందిన రామకృష్ణ, గత 6 సంవత్సరాలు రొయ్య సాగులో విజయకేతనం ఎగురవేస్తున్నారు ఈయన. రొయ్య నాడి తెలిసిన వ్యక్తిగా ఈ ప్రాంత రైతుల్లో మంచి పేరు సంపాదించారు. రేయింబవళ్లు కల్చర్ ను కంటికి రెప్పలా కాపాడుకుంటూ... సమస్య వచ్చిన వెంటనే, దాన్ని విశ్లేషణ చేసి సత్వరమే పరిష్కరిస్తారు. కేవలం పంటసాగుకే పరిమితం అవకుండా, కల్చర్ లో వస్తున్న మార్పులకు అనుగుణంగా అధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సాగులో ముందడుగు వేస్తున్నారు. దీనివల్ల ఈయన చేపట్టిన ప్రతీ కల్చర్ సక్సెస్ బాటలో పయనిస్తోంది. ప్రస్థుతం వనామి సాగులో వినూత్నంగా అందుబాటులోకి వచ్చిన నానో టెక్నాలజీ ఉత్పత్తులను సైతం ఉపయోగిస్తూ, రిస్కును పూర్తిగా అధిగమిస్తున్నారు. తక్కువ సాంద్రతలో పిల్ల వదిలి, ఎకరాకు రెండున్నర టన్నులకు తగ్గకుండా దిగుబడి తీస్తున్న ఈయన, ప్రస్థుతం వున్న తక్కువ ధరల్లో కూడా 2 లక్షలకుపైగా నికర రాబడి సొంతం చేసుకుంటున్నారు. వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

వనామి కల్చర్ లో సాంకేతిక సలహాల కోసం
చిరునామా
శేఖర్ రామ స్వామి
పశ్చిమ గోదావరి జిల్లా
సెల్ నెం : 9391010200

మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
https://www.youtube.com/results?searc...

కర్షక మిత్ర వీడియోల కోసం:
   / karshakamitra  

వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
   • ఎమ్.టి.యు  1271 వరి వంగడంతో సత్ఫలితా...  

ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం:
   • మినీ ట్రాక్టర్స్ తో తగ్గిన కష్టం|| ఒక...  

నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
   • అసిల్ నాటు కోళ్లతో లాభాలు భళా || Asil...  

పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
   • పాడి పరిశ్రమతో విజయపథంలో MBAపట్టభద్రు...  

మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
   • పొట్టి మేకలతో గట్టి లాభాలు||Success S...  

#karshakamitra #shrimpfarming #prawnaquaculture #shrimpfarmingtechnics

Facebook : https://mtouch.facebook.com/maganti.v...

posted by michikunpo