How to get free YouTube subscribers, likes and views?
Get Free YouTube Subscribers, Views and Likes

ఏపీ నిఘా విభాగం అధిపతిగా మహేష్ చంద్ర లడ్హా ! | IPS Mahesh Chandra Laddha Return To AP Services?

Follow
ETV Andhra Pradesh

ఏపీ నిఘా విభాగం అధిపతిగా మహేష్ చంద్ర లడ్హా నియమితులు కానున్నారు. 1998 బ్యాచ్ ఐపీఎస్ అధికారైన ఆయన ప్రస్తుతం సీఆర్ పీఎఫ్ లో ఐజీగా కొనసాగుతున్నారు. ఆయన కేంద్ర సర్వీసుల్లో డిప్యుటేషన్ ముగించుకుని ఒకటిరెండు రోజుల్లో రాష్ట్రానికి వచ్చి రిపోర్ట్ చేయనున్నారు. ఆ వెంటనే ఆయన్ను ఏపీ నిఘా విభాగం అధిపతిగా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడనున్నట్లు తెలిసింది. 2005లో ప్రకాశం జిల్లా ఎస్పీగా ఉండగా ఒంగోలు నడిబొడ్డున మావోయిస్టులు క్లెమోర్ మైన్లతో లడ్హా వాహనాన్ని పేల్చేశారు. అది బుల్లెట్ ప్రూఫ్ కావటంతో.. లడ్హా, ఆయన ఇద్దరు గన్ మెన్, డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డారు. ఈ దుర్ఘటనలో సామాన్య పౌరులు ఇద్దరు మృతిచెందగా.. నలుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. అప్పట్లో దేశవ్యాప్తంగా ఈ ఘటన సంచలనం సృష్టించింది.

గ్రేహౌండ్స్ లో అసాల్ట్ కమాండర్ గా మొట్టమొదట ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన మహేష్ చంద్ర లడ్హా ఆ తర్వాత చింతపల్లి ఏఎస్పీగా, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఆపరేషన్స్ విభాగం ఓఎస్డీగా పనిచేశారు. ప్రకాశం, నిజామాబాద్, గుంటూరు జిల్లాల్లో ఎస్పీగా, హైదరాబాద్ ఈస్ట్ జోన్ డీసీపీగా పనిచేశారు. ANIలో దాదాపు ఐదేళ్ల పాటు ఎస్పీగా, డీఐజీగా బాధ్యతలు నిర్వహించారు. విజయవాడ నగర జాయింట్ పోలీసు కమిషనర్ గా, నిఘా విభాగంలో ఐజీగా, విశాఖపట్నం నగర పోలీసు కమిషనర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. 2019 నుంచి 2020 మధ్య ఏపీ పర్సనల్ విభాగం ఐజీగా పనిచేసి... తర్వాత కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయి సీఆర్ పీఎఫ్ లో బాధ్యతలు చేపట్టారు. దాదాపు నాలుగేళ్ల తర్వాత రాష్ట్రానికి తిరిగిరానున్నారు.

#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews

☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps

For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us :   / etvandhrapradesh  
☛ Follow us :   / etvandhraprades  
☛ Follow us :   / etvandhrapradesh  
☛ Etv Win Website : https://www.etvwin.com/

posted by empfinden1d