Free YouTube views likes and subscribers? Easily!
Get Free YouTube Subscribers, Views and Likes

నవరాత్రి స్నాక్స్ కాంబో | Navarathri Snacks Combo | Festival snacks |

Follow
HomeCookingTelugu

నవరాత్రి స్నాక్స్ కాంబో | Navarathri Snacks Combo | Festival snacks | ‪@HomeCookingTelugu‬

#నవరాత్రిస్నాక్స్ కాంబో #NavarathriSnacksCombo #homecookingtelugu

Chapters

Promo : 00:00

పూర్ణాలు | Poornalu : 00:14

మిరియాల గట్టి వడలు | Miriyala Gatti Vadalu :05:20

Outro : 07:51

పూర్ణాలు | Poornalu | Poornam Boorelu

#poornalu #teluguvantalu #sweetsrecipes

కావలసిన పదార్థాలు

ఫిల్లింగ్ చేయడానికి కావలసిన పదార్థాలు
సెనగ పప్పు 1 కప్పు
నీళ్లు 1 1 / 2 కప్పులు
బెల్లం 1 కప్పు
తురిమిన కొబ్బరి 1 / 2 కప్పు
యాలకుల పొడి 1 టీస్పూన్
నెయ్యి

పిండి చేయడానికి కావలసిన పదార్థాలు
ఉప్పుడు బియ్యం 1 / 2 కప్పు
పచ్చి బియ్యం 1 / 2 కప్పు
మినపప్పు 1 / 4 కప్పు
ఉప్పు
వేయించడానికి సరిపడా నూనె

తయారుచేసే విధానం
పిండి తయారుచేసే విధానం
ఉప్పుడు బియ్యాన్ని, పచ్చి బియ్యాన్ని, మినపప్పుని వేరువేరుగా నీళ్ళల్లో ఐదు గంటలపాటు నానపెట్టాలి
ఇప్పుడు మినపప్పుని మిక్సీలో వేసి మెత్తటి పిండిలాగా తయారుచేసుకోవాలి
అలాగే, ఉప్పుడు బియ్యాన్ని, పచ్చి బియ్యాన్ని కూడా వేసి మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి
ఇప్పుడు ఈ పిండిని మొత్తం ఒక బౌల్లోకి వేసి, సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి
ఈ పిండి ఇడ్లీ పిండిలాగా పలచగా కాకుండా గట్టిగా, ఉండాలి
ఇప్పుడు ఈ పిండిని రాత్రంతా, అంటే సుమారుగా 8 గంటల పాటు పక్కన పెట్టి పులియపెట్టాలి
ఫిల్లింగ్ చేయడానికి కావలసిన పదార్థాలు
సెనగపప్పుని 2 గంటలపాటు నీళ్ళల్లో నానపెట్టాలి
నానపెట్టిన సెనగపప్పుని కుక్కర్లో వేసి, సరిపడా నీళ్లు పోసి, 3 విజిల్స్ వచ్చేంతవరకూ ఉడికించాలి
ఇప్పుడొక గిన్నెలో బెల్లం వేసి, అందులో నీళ్లు పోసి, ఒక ఉడుకు రానిచ్చిన తరువాత పక్కన పెట్టుకోవాలి
ఒక పాన్లో రుబ్బి పెట్టుకున్న సెనగపప్పుని వేసి, కాచి వడకట్టుకున్నబెల్లం పాకాన్ని అందులో వేసి ఒక ఉడుకు రానివ్వాలి
ఇందులో తురిమిన కొబ్బరి, యాలక్కాయాల పొడి వేసి, పొయ్యిని లోఫ్లేములో ఉంచి 2 నిమిషాలపాటు పప్పు మిశ్రమం దగ్గరపడే వరకూ కలుపుతూ ఉండాలి
ఇప్పుడు ఈ పప్పు బెల్లం మిశ్రమాన్ని కొద్దిగా చేతిలోకి తీసుకుని ఉండలాగా చుట్టుకుని, పక్కన పెట్టుకోవాలి
అన్ని ఉండల్ని ఒకే పరిమాణంలో ఉండేట్టు తయారుచేసుకుని పక్కన పెట్టుకోవాలి
పూర్ణాలు తయారుచేసే విధానం
పొయ్యిని మీడియం ఫ్లేములో ఉంచి, నూనెను మరిగించిన తరువాత, పప్పు ఉండల్ని పులియపెట్టిన పిండిలో ముంచి వాటిని ఒక్కొక్కటిగా నెమ్మదిగా వేసి వేయించుకోవాలి
ఈ పూర్ణాలని వేడిగా సర్వ్ చేసుకోవచ్చు లేదంటే రూమ్ టెంపరేచర్లో కూడా సర్వ్ చేసుకోవచ్చు

మిరియాల గట్టి వడలు | Miriyala Gatti Vadalu |

#miriyalagattivadalu #homecookingtelugu #peppervada #homecooking #hemasubramanian

కావలసిన పదార్థాలు:

మిరియాలు 1 టీస్పూన్
జీలకర్ర 1/2 టీస్పూన్
మినప్పప్పు 1/2 కప్పు (1 గంట నానపెట్టినది)
ఉప్పు 1/4 టీస్పూన్
బియ్యప్పిండి 2 టేబుల్స్పూన్లు

తయారుచేసే విధానం:

ముందుగా మిరియాలని, జీలకర్రని కలిపి పొడి పట్టి ఉంచాలి

మినప్పప్పుని ఒక గంట సేపు నీళ్లలో నానపెట్టిన తరువాత, నీళ్లు వంపేసి పప్పుని మిక్సీలో వేసి బరకగా అయ్యేట్టు నీళ్లు పోయకుండా రుబ్బాలి

రుబ్బిన మినప్పప్పు మిశ్రమంలో ఉప్పు, బియ్యప్పిండి, దంచిన మిరియాలపొడి వేసి అంతా బాగా కలిపి పిండిముద్దని తయారుచేసి పెట్టుకోవాలి

దీన్ని చిన్న చిన్న భాగాలుగా చేసి, పలచటి వడలాగా ఒత్తి, మధ్యలో చిన్న చిల్లు పెట్టి, నూనె బాగా కాగిన బాండీలో వేసి, డార్క్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకూ వేయించాలి

అంతే, మిరియాల గట్టి వడలు తయారైనట్టే, వీటిని వెంటనే సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే ఒక ఎయిర్ టైట్ డబ్బాలో వేసి నిలవుంచుకోవచ్చు


Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
https://www.amazon.in/shop/homecookin...

You can buy our book at https://shop.homecookingshow.in/

Follow us :
Facebook   / homecookingtelugu  
Youtube:    / homecookingtelugu  
Instagram   / home.cooking.telugu  

A Ventuno Production : http://www.ventunotech.com

posted by mucanbb