YouTube magic that brings views, likes and suibscribers
Get Free YouTube Subscribers, Views and Likes

Nellore Puli Bongaralu | నెల్లూరు పులి బొంగరాలు | Kara Chutney | Nellore Punugulu | Street Food

Follow
HomeCookingTelugu

Nellore Puli Bongaralu | నెల్లూరు పులి బొంగరాలు | Kara Chutney | Nellore Punugulu | Street Food ‪@HomeCookingTelugu‬

#bongaralu #punugulu #nellore #streetfood #homecookingtelugu #hemasubramanian

Other Snacks:

Vijayawada Punugulu:    • బండి మీద దొరికే పర్ఫెక్ట్ బెజవాడ పును...  
Ravva Punugulu:    • రవ్వ పునుగులు | Rava Punugulu | Insta...  
Pesara Punugulu:    • సాయంత్రం స్నాక్స్లోకి కమ్మటి పెసర పున...  
Saggubiyyam Vadalu:    • సగ్గుబియ్యం వడలు | Saggubiyyam Vadalu...  
Saggubiyyam Dosa:    • సగ్గుబియ్యం దోశ | Saggubiyyam Dosa | ...  
Ullikaram Chutney:    • టిఫిన్లలోకి ఎంతో రుచిగా ఉండే ఉల్లిపాయ...  

Chapters :
Promo & Intro : 00:00
Kara Chutney : 00:43
Bongaralu : 02:31
Serving and Tasting : 05:52

కావాల్సిన పదార్ధాలు :

కారం పచ్చడి :
నానపెట్టిన ఎండుమిరపకాయలు 7
ఉల్లిపాయ 1
వెల్లులి రెబ్బలు 4
చింతపండు
కల్లుప్పు 1 టీస్పూన్
జీలకర్ర 1 టీస్పూన్
నూనె 3 టీస్పూన్లు
మినపప్పు 1 టీస్పూన్
ఆవాలు
జీలకర్ర 1/2 టీస్పూన్
కరివేపాకు

పులి బొంగరాలు :

పులిసిన దోసపిండి
సన్నగా తరిగిన ఉల్లిపాయలు 2
నానపెట్టిన శెనగపప్పు 1/4 కప్పు
పచ్చిమిరపకాయలు 3
తరిగిన కరివేపాకులు
తరిగిన కొత్తిమీర
ఉప్పు 1 టీస్పూన్
నూనె

తయారీ విధానం :

ముందుగా కారం పచ్చడి చేసుకోవడానికి మిక్సీ జార్ లోకి నానపెట్టిన ఏడు ఎండుమిరపకాయలు , తరిగిన ఒక ఉల్లిపాయ , నాలుగు వెల్లులి రెబ్బలు , కొద్దిగా చింతపండు , ఒక టీస్పూన్ జీలకర్ర వేసి మిక్సీ పట్టుకోవాలి.

పచ్చడి తాలింపు కోసం ఒక చిన్న కడై లో మూడు టీస్పూన్లు నూనె ,ఒక టీస్పూన్ మినపప్పు , కొద్దిగా ఆవాలు , అరా టీస్పూన్ జీలకర్ర , కొద్దిగా కరివేపాకు , మిక్సీ పట్టుకున్న పచ్చడి వేసి ఒకసారి కలిపి స్టవ్ అఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి.

తరువాత పులి బొంగరాలు కోసం పులిసిన దోస పిండిని తీసుకొని అందులో రెండు సన్నగా తరిగిన పెద్ద ఉల్లిపాయ ముక్కలు , నానపెట్టిన శెనగపప్పు పావు కప్పు , మూడు సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు , కొద్దిగా తరిగిన కరివేపాకులు , కొత్తిమీర , ఒక టీస్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.

తరువాత ఒక గుంత కడై తీసుకొని అందులో డీప్ ఫ్రై కి సరిపడే అంత నూనె వేసుకోవాలి. నూనె బాగా కాగిన తరువాత పిండిని కొద్దిగా కొద్దిగా తీసుకుంటు బొంగరాల్ని జాగ్రత్తగా వేసుకోవాలి.

బొంగరాలు గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చాక తీసేసుకోవాలి , ఆలా మిగతా పిండి కూడా బొంగరాలు వేసుకొని వేడి వేడి గా కారం పచ్చడి తో కానీ కొబ్బరి పచ్చడి తో కానీ సర్వ్ చేసుకుంటే నెల్లూరు పులి బొంగరాలు రెడీ.

Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
https://www.amazon.in/shop/homecookin...

You can buy our book and classes on http://www.21frames.in/shop

Follow us :
Website: http://www.21frames.in/homecooking
Facebook   / homecookingtelugu  
Youtube:    / homecookingtelugu  
Instagram   / home.cooking.telugu  
A Ventuno Production : http://www.ventunotech.com

posted by mucanbb