15 Free YouTube subscribers for your channel
Get Free YouTube Subscribers, Views and Likes

Software engineer turned farmer || scripts success in natural farming || D Harikrishna || 9885858616

Follow
Raitu Nestham

#Rythunestham #Naturalfarming #organicfarming

వ్యవసాయంలోకి రావాలనే పిలుపు అందుకొని యువత సాగులో అడుగుపెడితే.. అద్భుతాలు సృష్టించేందుకు అవకాశాలు అనేకం. వాటిని అందిపుచ్చుకొని అభివృద్ధి చెందాలనే సంకల్పానికి సహజ సేద్య విధానాన్ని జోడిస్తే.. అబ్బురపరిచే ఫలితాలు సొంతం. ఈ బాటనే నమ్మారు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మందలపల్లి గ్రామానికి చెందిన దేవరపల్లి హరికృష్ణ. చదివింది బీటెక్. మొదట హైదరాబాద్... ఆ తర్వాత అమెరికాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం. అయినా మనసు వ్యవసాయంవైపే. దీంతో... పల్లెకు తిరిగొచ్చి.. తండ్రి బాటలోనే నాగలి పట్టారు. 35 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తు నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
35 ఎకరాల వ్యవసాయ భూమిలో.. 12 ఎకరాల్లో ఆయిల్ పామ్, కోకో.... మరో 10 ఎకరాల్లో కొబ్బరి కోకో.... 8 ఎకరాల్లో వరి పండిస్తున్నారు. ఖర్చులన్నీ పోను ఏడాదికి 20 లక్షలకు పైగా ఆదాయం పొందుతున్నారు.
ప్రకృతి వ్యవసాయం ద్వారా వరి సాగులో మంచి ఆదాయం పొందాలంటే.. రైతులు సొంతంగా బియ్యం మార్కెట్ చేయాలంటున్నారు హరికృష్ణ. వరి సాగులో అనుసరిస్తున్న పద్ధతులు... ఎరువులు... కలుపు యాజమాన్యం తదితర అంశాలు ఆయన మాటల్లోనే.......

posted by rybedog7y