Buy real YouTube subscribers. Best price and warranty.
Get Free YouTube Subscribers, Views and Likes

డైరీ పెట్టే కొత్తల్లో ఎవరిని అడిగినా డైరీ పెట్టవద్దు అన్న వాళ్లే | Successful Buffalo Dairy Farm

Follow
i3MEDIA

గుంటూరు జిల్లాకు చెందిన చంద్రశేఖర్ అనే రైతు గత సంవత్సర కాలం నుంచి డైరీ రంగంలో ఉన్నారు గతంలో ఇతర వ్యాపారాలు చేసుకొని జీవనం సాగించింది చంద్రశేఖర్ కరోనా ప్రభావం తను చేస్తున్న వ్యాపారంలో అంతగా ఆదాయం లేకపోవడంతో నిత్యం అవసరం ఉండే పాల వ్యాపారం అయితే బాగుంటుంది అని కొంతకాలం తన మిత్రులతో కలిసి కొన్ని డైరీ లను సంప్రదించారు ఆ డైరీ యజమానులు డైరీ రంగం అనేది అంత లాభదాయకమైన రంగం కాదని ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయని నిరుత్సాహంగా కొంత అసంతృప్తికి లోనైనా నా వెన్ను దిగకుండా వారి యొక్క ప్రయత్నం కొనసాగించారు నేస్తం డైరీ ఫామ్ అనే పేరుతో ఒక డైరీని నెలకొల్పారు గేదెల లో అంత అనుభవం లేకపోవడంతో వారు ఎంపిక చేసుకున్న వారు అనుకున్నంత పాల దిగుబడి రాకపోవడంతో నిరుత్సాహ పడ్డారు నిరుత్సాహాన్ని ఉత్సాహంగా మలచుకొని విను తిరగకుండా వారి యొక్క ప్రయత్నాన్ని కొనసాగించారు ప్రస్తుతం వారి వద్ద ఇరవై గేదలు ఉండగా రోజుకి 100 లీటర్ల పాల దిగుబడి వస్తుంది ఆ పాలను హోమ్ డెలివరీ చేస్తూ మంచి ఆదాయం లో ఉన్నామని డైరీ ఎజమాని చంద్రశేఖర్ చెబుతున్నారు

కొత్తగా డైరీ పెట్టాలనుకునే యువకులు ఎవరైనా సరే గేదెల ఎంపిక అనేది చాలా ముఖ్యమైనదని దాని గురించి తెలిసినప్పుడే డైరీ రంగంలోకి రావాలని గేదెల ఎంపిక తెలియకపోతే గేదెల ఎంపిక లో అనుభవం గడించిన రైతుల సహాయ సహకారాలు అందుకొని డైరీ లోకి రావాలని రైతు చంద్రశేఖర్ చెబుతున్నారు డైరీ రంగం అన్నది ఎన్నో ఆటుపోట్లతో ఉంటుందని వాటిని అధిగమించి నప్పుడే మంచి లాభాలు చవిచూడొచ్చనే రైతు చంద్రశేఖర్ చెబుతున్నారు

అసలు ఈ డైరీ రంగంలో ఉండే ఒడిదుడుకుల ఏమిటి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే డైరీ రంగంలో నిలబడగల ఎవరి వద్ద గేదని కొనాలి ఎలా కొనాలి అనే విషయాలతోపాటు మరెన్నో సలహాలు సూచనలు రైతు చంద్రశేఖర్ ఈ వీడియోలో తెలియజేయడం జరిగింది ఈ వీడియోలో ఉన్న వివరాలు కాకుండా మరి ఏ ఇతర సందేహాలు ఉన్నా రైతు చంద్రశేఖర్ ను సంప్రదించాలి అనుకుంటే ఈ వీడియోలో ఉన్న నెంబర్కు ఫోన్ చేయవచ్చు మీ అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చు





#i3MEDIA #i3Poultry #i3Farming #dairyfarm #buffalo #murrahbull #Nestamdiryfarm


;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన i3MEDIA లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలుసూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.

గమనిక : i3MEDIA చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి ఫార్మింగ్ చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

మీయొక్క వ్యాపారాన్ని మా ఛానల్ ద్వారా ప్రమోట్ చేసి అభివృద్ధి బాటలో పయనించాలని అనుకుంటే ఈ నెంబర్ కి కాల్ చేయండి 77 2991 2991
[email protected]

posted by vivacioustesta3