Grow your YouTube channel like a PRO with a free tool
Get Free YouTube Subscribers, Views and Likes

చిత్తూరు జిల్లాలో షెడ్లలో మేకల పెంపకం చేస్తున్న రైతులు

Follow
ETV Jaikisan

గొర్రెలు, మేకలను ఆరుబయట పెంచుతారనే అందరికీ తెలుసు. మేత కోసం కొండలు, కోనల్లో తిప్పుతారనే ఎరుక. రోజంతా పొలాలు, పుట్టల వెంబడి మేపే సంప్రదాయమే ఉనికిలో ఉంది. అందుకు భిన్నంగా గిరిగీసిన నాలుగు గోడలమధ్యే పెంచుతారంటే ఎవరూ నమ్మరు. అసలు షెడ్లు దాటి బయటకి తోలుకుపోకుండా...పోషించవచ్చంటే సామాన్య రైతులెవరూ ఒప్పుకోరు. కానీ కోళ్లు, పశువులు మాదిరిగా...షెడ్లలో చక్కగా పెంచవచ్చని కొందరు రుజువు చేశారు. సాధారణ పద్ధతికంటే..కట్టేసి మేపే విధానంలోనే జీవాలు బలిష్ఠంగా పెరుగుతాయని తమిళనాడు, కేరళలో ఇప్నిటికే రూపితమయ్యాయి. ఎత్తైన షెడ్లలో మేకలకు కావాల్సిన పోషక ఆహారం అందించే
పద్ధతి మన దగ్గర ఆదరణలోకి వస్తోంది. చిత్తూరు జిల్లాలో ఔత్సాహిక రైతులు అదే ప్రయత్నం చేస్తున్నారు. త్వరగా ఈతకొచ్చే తలచేరి మేకలను పెంచుతూ ఆకట్టుకుంటున్నారు.

posted by gnojnog52